: కిరణ్ పై దినేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తమ్ముడు సంతోష్ రెడ్డి చేస్తున్న కబ్జాలను అడ్డుకున్నాననే కక్షతోనే తనను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేయాల్సిన అధికారుల జాబితాలో తన పేరు లేనందునే తాను పదవీ కాలాన్ని పొడిగించాలని కోరానని అన్నారు. గచ్చిబౌలిలో సీమాంధ్ర న్యాయవాదుల సదస్సుకు అనుమతి ఇవ్వాలని తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని ఆయన అన్నారు. ఓ ఐపీఎస్ అధికారిపై హత్య కేసు నమోదైతే అతనిని తొలగించాలని తాను సూచించినా పట్టించుకోలేదని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటవడం ముఖ్యమంత్రికి ఇష్టం లేదని అందువల్లే మీడియా సమావేశంలో నక్సల్ సమస్య ఉత్పన్నమవుతుందని తనతో చెప్పించారని వెల్లడించారు. ఎస్పీ, డీఎస్పీల బదిలీల్లో పలుమార్లు జోక్యం చేసుకున్నారని దినేశ్ రెడ్డి మండిపడ్డారు.

  • Loading...

More Telugu News