: సీమాంధ్రులు ఆందోళన చెందవద్దు: షిండే
సీమాంధ్రులు ఆందోళన చెందవద్దని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే సూచించారు. సీమాంధ్రుల ఆందోళనలను కేంద్రం పరిగణనలోకి తీసుకుందని చెప్పారు. అయితే, తెలంగాణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టం చేశారు. ఆందోళనలు రేగిన మాట వాస్తవమేనని, సీమాంధ్రుల సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.