: విశాఖలో పూర్తిగా నిలిచిన విద్యుత్ సరఫరా
విశాఖ నగరంలో విద్యుత్ పూర్తిగా నిలిచిపోయింది. గాజువాక విద్యుత్ ఉపకేంద్రంలో సాంకేతికలోపంతో ఈ సమస్య తలెత్తింది. దాంతో, విశాఖ ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. అటు విశాఖ ఏజెన్సీలోనూ విద్యుత్ సమస్యలు తలెత్తాయి. మరోవైపు ఆర్టీపీపీలో మూడోరోజు కూడా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.