: హైదరాబాద్ లో మార్చి 8 వరకు పోలీసుల ఆంక్షలు


హైదరాబాదులోని అసెంబ్లీ, సచివాలయం, నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లతో పాటు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించకూడదని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అనురాగ్ శర్మ ప్రకటించారు. ఒకవేళ ఎవరైనా రాష్ట్ర రాజధానిలో సభలు, సమావేశాలు నిర్వహించాలనుకుంటే తమ అనుమతి తప్పని సరి అని అనురాగ్ శర్మ తెలిపారు.

అలాగే సచివాలయం, అసెంబ్లీ పరిసరాల్లో జెండాలు, మారణాయుధాలతో తిరగడాన్ని పోలీసులు నిషేధించారు. 
ఈ నెల 8వ తేదీ ఉదయం 6 గంటల వరకు నిషేధాజ్ఞలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News