: సోనియాతో ముగిసిన సీఎం చర్చలు


కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలితో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ సుదీర్ఘ చర్చలు జరిపారు. ఉదయం డిల్లీకి చేరుకున్న సీఎం ముందుగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ ఆజాద్ తో ఆయన నివాసంలో భేటీ అయి పలు విషయాలపై చర్చించారు. అక్కడి నుంచి నేరుగా అధినేత్రి సోనియా నివాసానికి వెళ్ళిన  సీఎం కిరణ్ కుమార్ ఆమెతో గంటపాటు సమావేశం అయ్యారు. తెలంగాణ సహా, సహకార ఎన్నికలు, పార్టీ పరిస్థితి, పలు ఇతర అంశాలపై వీరి మధ్య సమాలోచనలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని మర్యాద పూర్వకంగా కలిసారు. 

  • Loading...

More Telugu News