: తిరుమలకూ తప్పని పవర్ కట్


సీమాంధ్రలో నెలకొన్న విద్యుత్ సంక్షోభం ప్రజలనే కాక దేవుళ్లనూ తాకింది. విద్యుత్ ఉద్యోగుల సమ్మె కారణంగా సీమాంధ్ర జిల్లాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలోని ప్రముఖ దేవాలయాలు కూడా పవర్ కట్ సమస్యను ఎదుర్కొన్నాయి. ప్రఖ్యాతి గాంచిన తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుచానూరు దేవాలయాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అయితే తిరుమల శ్రీవారి ఆలయానికి, తితిదే పరిపాలనా భవనానికి మాత్రం తితిదే సొంత ప్లాంటు నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్తును వాడుకుంటున్నారు. కానీ, ఈ సదుపాయం లేని శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుచానురు దేవాలయాల్లో మాత్రం చిమ్మ చీకట్లు అలుముకున్నాయి.

  • Loading...

More Telugu News