: కామన్వెల్త్ క్రీడల నిర్వాహక కమిటీని వదలని కేసులు
న్యూఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలు ముగిసి మూడేళ్లవుతోంది. ఏర్పాట్లలో అవకతవకలు, అక్రమాలు వెలుగు చూసిన తర్వాత.. వీటికి సంబంధించి నిర్వాహక కమిటీ డజన్ల సంఖ్యలో కేసుల్లో ఇరుక్కుపోయింది. 24 కేసులకుపైగా పలు కోర్టుల్లో పెండింగులో ఉన్నాయని నిర్వాహక కమిటీ సీఈఓ జర్నయిల్ సింగ్ తెలిపారు. 350 కోట్ల రూపాయల ఆదాయంతో ఇవన్నీ ముడిపడి ఉన్నాయని చెప్పారు.