: ఆందోళనకారులపై రబ్బరు బుల్లెట్లు ప్రయోగించిన పోలీసులు
విజయనగరంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులు బొత్సను టార్గెట్ చేస్తున్నారు. ప్రస్తుతం నగరంలోని బొత్సకు చెందిన సత్య ఇంజినీరింగ్ కాలేజీపై సమైక్యవాదులు దాడులు చేస్తున్నారు. దీంతో వీరిని చెదరగొట్టడానికి పోలీసులు రబ్బరు బుల్లెట్లను ప్రయోగించారు. విజయనగరంలో కర్ఫ్యూ విధించినా సమైక్యవాదులు లెక్కచేయకుండా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఆందోళనకర పరిస్థితి నెలకొంది.