: అమెరికా షట్ డౌన్... కొనసాగుతోంది!
అగ్రరాజ్యం అమెరికాలో షట్ డౌన్ కొనసాగుతోంది. బడ్జెట్ కు ఆమోదం తెలుపకపోవడంతో ఈ నెల 1న మొదలైన షట్ డౌన్ శనివారం కూడా కొనసాగింది. అత్యవసర సర్వీసులు మినహా అన్ని ప్రభుత్వ వ్యవస్థలూ మూతపడడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరోగ్య బీమాను ఉద్యోగులు అందరికీ తప్పనిసరి చేస్తూ ఒబామా చేసిన బిల్లుకు రిపబ్లికన్లు ఆమోదించకపోవడంతో ఈ ప్రతిష్టంభన ఏర్పడింది. అయినా, బిల్లు విషయంలో వెనక్కి తగ్గేది లేదని, రిపబ్లికన్లు దీనికి ఆమోదం తెలపాలని ఒబామా కోరారు. షట్ డౌన్ వల్ల ఆర్థిక పరిస్థితి దిగజారుతుందని, బడ్జెట్ కు ఆమోదం తెలపాలని అభ్యర్థించారు. ప్రతిష్టంభనకు తెరదించాలని రిపబ్లికన్లకు అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ కూడా విజ్ఞప్తి చేశారు.