: కొలెస్టరాల్‌ని కొలెస్టరాల్‌తోనే కరిగించాలి!


శరీరంలో పేరుకుపోయిన కొలెస్టరాల్‌ను కరిగించాలంటే ఏం చేయాలి... శారీరక వ్యాయామం చేయాలి. కొలెస్టరాల్‌ తక్కువగా ఉన్న పదార్ధాలను తీసుకోవాలి... ఇలా చెప్పుకుంటూ పోతున్నారా... అదేంకాదు... కొలెస్టరాల్‌ ఉండే ఆహారపదార్ధాలను తీసుకోవాలి. అదేంటి, కొవ్వు కరిగించుకోవాలంటే కొవ్వుండే ఆహారాన్ని తీసుకోమంటున్నారు అనుకుంటున్నారా... కొలెస్టరాల్‌ అంటే మంచి కొలెస్టరాల్‌ ఉండే ఆహారం. మన శరీరానికి మేలు చేసే కొలెస్టరాల్‌ ఉండే ఆహార పదార్ధాలను తీసుకోవడం ద్వారా శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్టరాల్‌ను అది కరిగించేస్తుందట.

టెక్సాస్‌ టెక్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పోషకాహార శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధనలో శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్టరాల్‌ను కాలేయం విడుదల చేసే ఎస్‌సీడీ1 అనే ఎంజైము యొక్క జీవక్రియను మెరుగుపరచడం ద్వారా కరిగించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ ఎంజైము శరీరంలోని చెడు కొలెస్టరాల్‌ మంచిదిగా మారేందుకు దోహదం చేస్తుందట. మనం తీసుకునే ఆహారంద్వారా లభించే లినోలీక్‌ ఆమ్లం, విత్తన, శాకాహార నూనెల స్థాయిలను బట్టి కాలేయం ఈ ఎంజైమును విడుదల చేస్తుంది. ఇవి ఎక్కువగా ఉండే ఆహారపదార్దాలను తీసుకోవడం ద్వారా శరీరంలోని చెడు కొలెస్టరాల్‌ను కరిగించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఈ విషయమై శాస్త్రవేత్తలు ఎలుకలపై చేసిన పరిశోధనల్లో విజయాన్ని సాధించారు.

  • Loading...

More Telugu News