: సమర్థవంతంగా బాధ్యత నిర్వహిస్తా: పదవ పీఆర్సీ చైర్మన్ పి.కె అగ్వరాల్


పదవ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఛైర్మన్ గా తనను నియమిస్తూ ప్రభుత్వం ప్రకటించడాన్ని తనపై ఉంచిన బాధ్యతగా భావిస్తానని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ డైరెక్టర్ జనరల్, రిటైర్డు ఐఏఎస్ అధికారి పి.కె అగ్వరాల్ చెప్పారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన, అప్పగించిన బాధ్యతను అత్యంత సమర్ధవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్ ను కలిసిన తర్వాత పదవీ బాధ్యతలు స్వీకరిస్తానని అగర్వాల్ చెప్పారు. పీఆర్సీని ఏర్పాటు చేస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News