: మైసూరులో దసరా ఉత్సవాలు ప్రారంభం
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మైసూరు దసరా ఉత్సవాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. మైసూరులోని చాముండి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఈ ఉత్సవాలు మొదలయ్యాయి. ఉత్సవాల నేపథ్యంలో మైసూరులో పండుగ వాతావరణం నెలకొంది. ప్రఖ్యాతి గాంచిన ప్యాలెస్ ఉత్సవాలకు ముస్తాబయింది. రాజ్యాలు పోయినా... మైసూరు వడయార్ రాజులు ఇప్పటికీ వారి ఘనమైన వారసత్వాన్ని కొనసాగిస్తుండడం విశేషం. ఈ ఉత్సవాలను సందర్శించడానికి మన దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భారీస్థాయిలో సందర్శకులు వస్తుంటారు.