: ప్రకాశం జిల్లాకు కరెంటు కట్
విద్యుత్ ఉద్యోగుల అరెస్టుకు నిరసనగా ప్రకాశం జిల్లాలో ఆ శాఖ ఉద్యోగులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రోడ్డుపై టైర్లను తగులబెట్టి వాహనాల్ని అడ్డుకుంటుండగా పోలీసులు విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ నాయకుల్ని అరెస్టు చేశారు. ఇక సీమాంధ్ర బంద్ లో భాగంగా ఉద్యోగుల జేఏసీ ఒంగోలు-కర్నూలు రహదారిని దిగ్బంధం చేసింది.