: 'హర్ష'కుమారుల వీరంగం.. సమైక్యవాదులను తరిమి కొట్టిన ఎంపీ పుత్రులు
అమలాపురం ఎంపీ హర్షకుమార్ కళాశాల (రాజీవ్ గాంధీ కళాశాల)కు చెందిన ఫ్లెక్సీని చించారని సమైక్యవాదులపై ఎంపీ హర్షకుమార్ కుమారులు తీవ్రంగా దాడి చేశారు. హర్షకుమార్ కుమారులిద్దరూ వీధి రౌడీల్లా ఎంపీ సెక్యూరిటీ సహాయంతో కర్రలతో కొట్టారు. దీంతో ఏపీఎన్జీవోలకు చెందిన పలువురు ఉద్యోగులు గాయపడ్డారు. ఎంపీ పుత్రరత్నాలు దాడికి దిగుతుంటే పోలీసులు చూస్తూ ఉన్నారు తప్ప వారిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సమైక్యవాదులు భారీగా చేరుకోనున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్యమ కారులు రాళ్లతో దాడిచేసి కళాశాల అద్దాలను ధ్వంసం చేశారు.