: విభజనపై జేపీ ఆందోళన


రాష్ట్ర విభజనకు మద్దతుగా కొంతమంది రాజకీయ నేతలు అనుసరిస్తున్న విధానాలపై లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి దుర్మార్గమైన రాజకీయాలన్నారు. ఈ సమయంలోనే సర్దార్ పటేల్ చూపిన లౌక్యం ప్రదర్శించాలన్నారు. ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని కొంతమంది చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలోనే ప్రాంతీయవాద ప్రజలు సంయమనం చూపాలని సూచించారు.

బలవంతంగా రాష్ట్రాన్ని విడదీయలేరు, కలిపి ఉంచలేరన్న జేపీ, చివరికి రెండు ప్రాంతాల్లో నష్టపోయేది ప్రజలేనని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయమే ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయమని పార్టీ కార్యాలయంలో మీడియాతో ఏర్పాటుచేసిన సమావేశంలో పేర్కొన్నారు. అధికారాన్ని పిచ్చివాడి చేతిలో రాయిలా ప్రభుత్వాలు ప్రయోగిస్తున్నాయని వాపోయిన ఆయన 17 నెలల కాలంలో 540 సంస్ధానాలను విలీనంచేసి దౌత్యనీతి ప్రదర్శించిన రాజనీతిజ్ఞుడు సర్దార్ పటేల్ అని కొనియాడారు.

  • Loading...

More Telugu News