: ఆందోళన తీవ్రం చేసిన సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు
సచివాలయ ఉద్యోగులు కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రం చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు తమతో దురుసుగా ప్రవర్తించారంటూ మహిళా ఉద్యోగులు సీ బ్లాక్ ముందు బైఠాయించారు. పోలీసుల తీరుపై సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల జేఏసీ నేత మురళీకృష్ణ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.