: రెండోరోజూ 'పినాక' ప్రయోగం విజయవంతం
దేశీయంగా అభివృద్ధి చేసిన పినాక రాకెట్లను వరుసగా రెండో రోజూ విజయవంతంగా పరీక్షించారు. ఒడిషాలోని చాందీపూర్ ప్రయోగ కేంద్రం వద్ద మల్టీ బారెల్ రాకెట్ లాంచర్ నుంచి వీటిని ప్రయోగించారు. మొత్తం మూడు రౌండ్ల పాటు వీటిని ప్రయోగించగా లక్ష్యాన్ని ఛేదించడంలో కచ్చితత్వాన్ని ప్రదర్శించాయని రక్షణ వర్గాలు వెల్లడించాయి. ఈ రాకెట్లను నిన్న కూడా ప్రయోగించిన సంగతి తెలిసిందే. కాగా, గత జనవరి 30, 31 తేదీల్లోనూ ఏడు పినాక రాకెట్లను ప్రయోగించారు.