: బొత్స ఇల్లు, కాలేజీ ముట్టడి... గాల్లోకి కాల్పులు
కేంద్ర కేబినేట్ నిర్ణయానికి వ్యతిరేకంగా విజయనగరంలో విద్యార్థులు కదం తొక్కుతున్నారు. పీసీసీ అధ్యక్షుడు బొత్స ఇంటితో పాటు ఆయన కాలేజీపై దాడికి ప్రయత్నించారు. బొత్స కాలేజీపై విద్యార్థులు రాళ్లు రువ్వుతున్నారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు విద్యార్థులపై లాఠీఛార్జ్ చేశారు. దీంతో పాటు బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. విద్యార్థులు, సమైక్యవాదులు పోలీసులపై రాళ్లు, కర్రలతో దాడిచేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో... పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఇంకా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.