: గ్రహాల పుట్టుక రహస్యం చేధిస్తున్న శాస్త్రవేత్తలు


భూమికి 335 కాంతి సంవత్సరాల దూరంలో ఓ నక్షత్రం గ్రహంగా మారటాన్ని చిలీలోని యూరోపియన్ సౌతర్న్ అబ్జర్వేటరీ గుర్తించింది. ఇక్కడి భారీ టెలిస్కోపుతో ఈ గ్రహం పుట్టుకకి సంబంధించిన తొలి దృశ్యాలను శాస్త్రవేత్తలు తీయగలిగారు. కొత్తగా రూపు దిద్దుకోబోతున్న ఈ గ్రహనికి హెచ్.డి 100546 అని పేరు పెట్టారు. 

మన సౌర వ్యవస్థలోని గురు గ్రహానికంటే ఈ గ్రహం ఆరు రెట్లు పెద్దగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కొత్త గ్రహం ఏర్పడటానికి ముందు ఆ నక్షత్రం చుట్టూ పెద్ద ఎత్తున ధూళి మేఘాలు ఏర్పడి ఉన్నాయి.  మన సౌర మండలానికి పొరుగున ఉన్న ఈ కొత్త గ్రహం ఉనికిని తొలిసారిగా గుర్తించిన శాస్త్రవేత్తలు ముందు ఆశ్చర్యపోయారు. ఆ వెంటనే తేరుకుని.. గ్రహం పుట్టుక సమయంలో పరిస్థితులను శాస్త్రవేత్తలు తొలిసారిగా చిత్రీకరిస్తున్నారు. ఈ గ్రహం మీద పరిశోధనలు చేస్తే గ్రహల పుట్టుకకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
 

  • Loading...

More Telugu News