: కేబినెట్ నోట్ సీమాంధ్రులను రెచ్చగొట్టేదిగా ఉంది: కావూరి
కేబినెట్ భేటీలో తెలంగాణ నోట్ పై తీవ్రంగా చర్చ కొనసాగుతోంది. గంటన్నరకు పైగా సాగుతున్న చర్చలో తెలంగాణ నోట్ సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టేదిలా ఉందని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. కేబినెట్ భేటీ మధ్యలో ఇద్దరు మంత్రులు బయటకు వచ్చారు. కాగా, వారెవరనే దానిపై స్పష్టమైన సమాచారం లేదు. కేబినెట్ నోట్ పై తీవ్ర వాగ్వాదం జరిగినట్టు సమాచారం.