: బీసీసీఐ స్పాన్సర్ షిప్ హక్కులు ఈఎస్పీఎన్ వశం
బీసీసీఐ టైటిల్ స్పాన్సర్ షిప్ హక్కులు ఈఎస్పీఎన్ స్టార్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది. రెండు కోట్ల రూపాయలకు ఏకైక బిడ్ దాఖలైన ఈ స్పాన్సర్ షిప్ లో గతంలో వేసిన కోట్ కంటే 1.5 కోట్ల తక్కువ రేటుకు కట్టబెట్టడం విశేషం. 2013-14 ఏడాదికి గాను భారత్ లో జరిగే అన్ని దేశవాళీ, అంతర్జాతీయ టోర్నమెంట్లను ఈఎస్పీఎన్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. వచ్చే ఏడాది మార్చివరకు ఈ ఒప్పందం అమలులో ఉంటుంది. అప్పటి వరకు భారత్ ఆసీస్, విండీస్ టోర్నమెంట్లు ఆడనుంది.