: క్రికెట్ దేవుడి తొలి రికార్డు దగ్ధం..కాంబ్లీ ఆవేదన


సచిన్ టెండూల్కర్, తన బాల్య స్నేహితుడు వినోద్ కాంబ్లీతో కలిసి స్కూల్ టీం తరపున 664 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేసిన మ్యాచ్ స్కోరు కార్డు దగ్ధం అయింది. అయితే నేడు క్రికెట్ దేవుడిగా నీరాజనాలందుకుంటున్న సచిన్..చరిత్రను రాయటం మొదలు పెట్టింది..ఆ మ్యాచ్ తోనే. 1988లో అంజుమాన్-ఇ-ఇస్లాం హైస్కూల్ పై జరిగిన ఈ మ్యాచ్ లో సచిన్ 326 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

పాతికేళ్ల కిందట తనతో కలిసి సచిన్ చేసిన ఈ అరుదైన ఫీట్ కు గుర్తుగా ఉండాల్సిన మ్యాచ్ షీట్ ను ఇలా చేయడం దారుణమని కాంబ్లీ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కనీసం తనకు గాని, సచిన్ కు గాని ఆ మ్యాచ్ షీట్ ను ఇచ్చి ఉంటే భద్రంగా దాచుకొని ఉండేవాళ్లమని కాంబ్లీ అన్నాడు. ఈ మ్యాచ్ షీట్ ను 10 లక్షలకు తనకు ఇవ్వాల్సిందిగా ఓ ఆస్ట్రేలియన్ సేకరణ కర్త ముంబై స్కూల్ స్పోర్ట్స్ అసోసియేషన్ ను అభ్యర్థించినా నిరాకరించడం గమనించదగ్గ అంశం.

  • Loading...

More Telugu News