: లాలూకు ఐదేళ్ల జైలు శిక్ష
దాణా కుంభకోణం కేసులో దోషిగా నిరూపితుడైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (66)కు రాంచి కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతోపాటు రూ.25 లక్షల జరిమానా విధించింది. ఈ కేసులో మరో నిందితుడైన బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాకు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పునిచ్చింది. పదిహేడు సంవత్సరాల క్రితం నాటి ఈ కేసులో సెప్టెంబర్ 30న లాలూ సహా 45 మందిని కోర్టు దోషులుగా తేల్చిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు లాలూ తన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోనున్నారు. కోర్టు తీర్పుతో ఆరు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీచేసే అర్హతను కూడా కోల్పోనున్నారు.