: బాపు బాటలో నడుస్తా: రాహుల్ గాంధీ
తాను మహాత్మాగాంధీ బాటలో నడుస్తానని గాంధీ సిద్ధాంతాలను పాటిస్తానని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. గుజరాత్ సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించిన రాహుల్, ఆశ్రమంలో అరగంటకు పైగా గడిపారు. సబర్మతీ ఆశ్రమానికి రావడాన్ని తానెప్పుడూ గౌరవంగా భావిస్తానని సందర్శకుల పుస్తకంలో రాశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాహుల్ సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించారు. అహ్మదాబాద్, రాజ్ కోట్ లో కార్యకర్తలు, నేతలతో రాహుల్ సమావేశమై మోడీని ఎలా ఎదుర్కోవాలో పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేయనున్నాడు.