: పార్టీలను పక్కన పెడదాం.. జేఏసీగా ఏర్పడదాం: మంత్రి ఆనం
తెలంగాణ నోట్ కేబినెట్ భేటీ ముందుకు వస్తున్న నేపథ్యంలో సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తమ కార్యాచరణను మరింత ఉద్ధృతం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో సమావేశమైన సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తీవ్రంగా చర్చిస్తున్నారు. ఇన్ని రోజులు గడుస్తున్నా లాభం లేకపోవడంతో పార్టీలను పక్కన పెట్టి అందరూ జేఏసీగా ఏర్పడాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. జేఏసీలోకి చంద్రబాబు కూడా రావాలని డిమాండ్ చేశారు. అందరూ కలిస్తే రాష్ట్ర విభజన ఆగుతుందని, చంద్రబాబు తెలంగాణ లేఖను వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ సమావేశానికి లగడపాటి, గంటా, ఆనం, రఘువీరా, గల్లా అరుణ, పురంధేశ్వరి పలువురు సీమాంధ్ర నేతలతో సహ 33 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎమ్మెల్సీలు హాజరయ్యారు.