: ఆర్డినెన్స్ ఉపసంహరణ భేష్ : జస్టిస్ సంతోష్ హెగ్డే


కళంకిత ప్రజాప్రతినిధులకు సంబంధించిన వివాదాస్పద ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకోవడం హర్షణీయమని కర్ణాటక మాజీ లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెగ్డే తెలిపారు. బెంగళూరులో ఆమ్ ఆద్మీ పార్టీ నిర్వహించిన ప్రజాస్వామ్య నడకలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నాటకీయ కారణాలేమైనప్పటికీ, ఆర్డినెన్స్ ను ఉపసంహరించుకోవడంతో ప్రజలకు ఎంతో మేలు జరిగిందని అన్నారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన ముసాయిదా కంటే... జారీ చేసిన ఆర్డినెన్స్ చాలా ఘోరంగా ఉందని తెలిపారు. అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయినట్టు నిర్దారణ జరిగినప్పటికీ... సామాన్య ప్రజల కంటే ప్రజాపతినిధులే గొప్ప వ్యక్తులుగా గుర్తించే విధంగా ఆర్డినెన్స్ ఉందని హెగ్డే విమర్శించారు.

చట్టం దృష్టిలో సామాన్యుడు, రాజకీయ నాయకుడు ఇద్దరూ ఒకటేనని తెలిపారు. రాజకీయ నాయకులు స్వార్థానికి, అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచారని దుయ్యబట్టారు. ప్రజల కంటే తాము ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన వారుగా నేతలు ప్రవర్తిస్తున్నారని అన్నారు. తాము ఎన్నుకున్న నాయకుడిని కలవాలనుకున్నా... ప్రజలు గంటల తరబడి క్యూలో వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News