: నాడీసంబంధ సమస్యలకు కొత్త చికిత్స!


పలు రకాలైన నాడీ సంబంధ వ్యాధులకు సరికొత్త చికిత్సను అందించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. మెదడుకు సంబంధించిన కణాలను ప్రయోగశాలల్లో పెంచి వాటిని రోగులకు మార్పిడి చేయడం ద్వారా ఇలాంటి వ్యాధులకు సమర్ధవంతమైన చికిత్సలు చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇలా మన మెదడులో చేరి మనకు వైద్యం చేసే కణాలను ప్రయోగశాలల్లో పెంచే విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ విధానం ద్వారా పెంచిన మెదడు కణాలను రోగులకు మార్పిడి చేయడం ద్వారా పలు రకాలైన నాడీ సంబంధ సమస్యలకు చికిత్స అందించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

సూక్ష్మ బయాప్సీ విధానం ద్వారా సేకరించిన మెదడు కణాలను భారీ సంఖ్యలో వ్యక్తిగత కణాలుగా ప్రయోగశాలలో పెంచుతారు. ఈ కణాలు ఆరోగ్యకరమే కాకుండా, నిల్వవుండి భవిష్యత్తులో గాయాలు, విషప్రభావం, పలు రకాలైన వ్యాధులనుండి మెదడును కాపాడే సాధనాలుగా కూడా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రయోగశాలనుండి ఈ కణాలను అవసరమైన వారికి మార్పిడిచేసే అవకాశం కూడా భవిష్యత్తులో పెరుగుతుందని ఈ పరిశోధన విజయవంతం కావడంతో ఇప్పటి వరకూ చికిత్స లేని కొన్ని రకాలైన నాడీసంబంధమైన మొండి జబ్బులకు కూడా భవిష్యత్తులో వ్యక్తిగతమైన కణ ఆధార వైద్యం అందించే అవకాశాలు అందుబాటులోకి వస్తాయని వెస్టరన్‌ ఒంటారియో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు మాథ్యూ ఒ.హెబ్‌ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News