: రాంచీ జైల్లో లాలూని కలిసిన రాబ్రీదేవి!


పశుగ్రాస కుంభకోణం కేసులో దోషిగా రుజువై రాంచీ జైల్లో ఉన్న ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ను ఆయన సతీమణి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి రాబ్రీ దేవి ఈ రోజు సాయంత్రం కలుసుకున్నారు. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ప్రవాస్ కుమార్ సింగ్ గురువారం శిక్ష ఖరారు చేయనున్న సంగతి తెలిసిందే. రాంచీ జైల్లో ఉన్న లాలూని కలుసుకోవడానికి ముందు రాబ్రీదేవి, పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలతో భవిష్యత్ కార్యచరణను, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించారు. ఈ సమావేశంలో లాలూ స్థానంలో రాబ్రీదేవి పార్టీకి నాయకత్వం వహించాలని ఆ పార్టీ నాయకుడు రాం కృపాల్ యాదవ్ కోరారు. లాలూ సూచనల ప్రకారం పార్టీని పటిష్టం చేద్దామని మరో నేత అన్నారు.

  • Loading...

More Telugu News