: వృద్ధుల ఆవాసానికి భారత్ అంత క్షేమదాయకం కాదట!


వయసు మీరిన వారు బతకడానికి భారత్ ఏమాత్రం అనుకూలమైన ప్రాంతం కాదని ఓ అధ్యయనం చెబుతోంది. 'గ్లోబల్ ఏజ్ వాచ్ ఇండెక్స్ 2013' పేరుతో ఈ వివరాలను వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు ఇతర ఏజెన్సీల దగ్గరున్న డేటాను ఆధారంగా చేసుకుని అధ్యయనం చేశారు. ఈ అధ్యయనం ప్రపంచ దేశాల్లో వృద్ధుల ఆవాసానికి ఉన్నటువంటి వసతులను, అనుకూలతలను ప్రపంచానికి వెల్లడించింది. మొత్తం 91 దేశాలపై అధ్యయనం చేస్తే.. విచారించదగ్గ రీతిలో మన దేశం 73వ స్థానాన్ని ఆక్రమించింది.

వృద్ధులు నివసించడానికి అన్నింటికన్నా ఉత్తమ దేశంగా స్వీడన్ ఎంపికైంది. దీని తర్వాత స్థానాల్లో నార్వే, జర్మనీ నిలిచాయి. అత్యంత ఛండాలమైన దేశంగా ఆఫ్ఘనిస్థాన్ జాబితాలో చిట్టచివరి స్థానాన్ని పొందింది. దీనికి పైనున్న రెండు స్థానాలను టాంజానియా, పాకిస్థాన్ కైవసం చేసుకున్నాయి.

  • Loading...

More Telugu News