: ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. నిందితుడి అరెస్టు


కామాంధులకు అడ్డుకట్ట పడడంలేదు. పసివాళ్లను నిర్థాక్షిణ్యంగా వారి కామదాహానికి బలిచేస్తున్నారు. ఈమధ్య కాలంలో దేశంలో చోటు చేసుకుంటున్న అత్యాచార ఘటనల్లో సింహభాగం పసివారిపైనే జరుగుతున్నాయి. కోల్ కతా లోని బౌబజార్ ప్రాంతంలో నివాసముండే ఓ ఆరేళ్ల చిన్నారిని మహ్మద్ ఇర్షాద్ అనే వ్యక్తి బాత్రూంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక పెద్దగా అరవడంతో ఇర్షాద్ పరారయ్యాడు. స్థానికులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసి బాలికను ఆసుపత్రికి తరలించారు. బాలికకు అంతర్గతంగా గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. అనంతరం పోలీసులు నిందితుడిని అరెస్టు చేసినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News