: వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ టీవీ నటి
సులభ మార్గాల్లో డబ్బు సంపాదన కోసం కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. తాజాగా హైదరాబాదులో ఓ తెలుగు టీవీ నటి వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. వివరాల్లోకెళితే.. మాదాపూర్లో హైటెక్ వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం మేరకు పోలీసులు అక్కడి ఫార్చ్యూన్ టవర్స్ పై దాడి చేశారు. అక్కడ ఓ ఫ్లాట్ లో వ్యభిచారం చేస్తున్న టీవీ సీరియల్ నటి శ్రావణి (23)తో పాటు విటుడు జీడిమెట్ల జయరాజ్ స్టీల్ కంపెనీ ఎండీ సజ్జన్ గోయెంకా పట్టుబడ్డారు. వ్యభిచార గృహ నిర్వాహకుడు మదన్ పరారయ్యాడు. అతని వద్ద పనిచేసే వెంకటరమణను అరెస్టు చేశారు. కాగా, టీవీ నటితో గడిపేందుకు సజ్జన్ గోయెంకా లక్ష రూపాయలు చెల్లించాడని పోలీసులు తెలిపారు. అరెస్టయిన శ్రావణి.. 'లయ', 'హిమబిందు' వంటి పలు సీరియళ్ళలో నటించింది.