: ప్రియుడిపై యాసిడ్ చిమ్మిన యువతి


సీన్ రివర్సయింది! పెళ్ళికి అంగీకరించలేదని ఓ యువతి ప్రియుడిపై యాసిడ్ దాడికి పాల్పడింది. ఉత్తరప్రదేశ్ లో జరిగిందీ ఘటన. లక్నో సమీపంలోని పధ్ని గ్రామంలో ఓ యువతి, ధర్మేంద్ర అనే యువకుడు ప్రేమించుకున్నారు. 20 ఏళ్ళ ఆ యువతి ఓ రోజు ప్రియుడి ముందు పెళ్ళి ప్రతిపాదన ఉంచింది. దీనికి అతడు నిరాకరించాడు. అప్పటి నుంచి ధర్మేంద్రపై కోపం పెంచుకున్న ఆ యువతి సోమవారం అతడిపై యాసిడ్ చిమ్మింది. దీంతో, తీవ్రగాయాలపాలైన ఆ యువకుడిని లక్నో మెడికల్ కాలేజీ హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ యువతిని అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News