: తెలంగాణ నోట్ మరింత ఆలస్యం: పీటీఐ


తెలంగాణ నోట్ మరింత ఆలస్యమయ్యేలా ఉందని ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ (ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా) పేర్కొంది. నోట్ కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇంకా తుదిరూపు ఇవ్వలేదని తెలిపింది. కేబినెట్ నోట్ ముసాయిదాకు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఆమోదం లభించలేదని చెప్పింది. ఆంటోనీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సుల కోసం హోం మంత్రిత్వ శాఖ ఎదురుచూస్తోందని వెల్లడించింది. ఆ తర్వాత నోట్ సోనియా, ప్రధాని మన్మోహన్ సింగ్ ముందుకు వెళుతుందని.. వారి ఆమోదం తర్వాతే న్యాయశాఖ వద్దకు 'టీ-నోట్' వస్తుందని చెప్పింది. ఇవన్నీ పూర్తయ్యాకే 'టీ-నోట్' మంత్రివర్గం ముందుకు వస్తుందని వివరించింది. ఇదంతా చూస్తుంటే ఇప్పుడప్పుడే తెలంగాణ విభజన పూర్తికాదని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News