: మెరుపులీనే ముఖానికి నిద్రే మందు


మీ ముఖం చక్కగా మెరుపులీనుతూ ఉండాలనుకుంటున్నారా... అయితే చక్కగా నిద్రపోండి. మీరు ఏదైనా ఫంక్షన్‌కు, లేదా ఇంటర్వ్యూకు వెళ్లాల్సి ఉంటే మీ ముఖం వాడిపోయినట్టుగా కాకుండా చక్కగా మెరుస్తూ ఉండేలా ఉంటే దాని ప్రభావం వేరుగా ఉంటుంది. ఇందుకోసం మామూలుగా అయితే బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగడం, బోలెడు డబ్బు తగలేయడం చేస్తుంటాం. అయితే ఎంచక్కా ఇంట్లోనే ప్రశాంతంగా నిద్రపోతే మీ ముఖారవిందం చక్కగా మెరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

మీరు ఎప్పుడైనా ఒకరాత్రి సరిగా నిద్రపోకుండా ఉండి గమనించండి. మీ ముఖం ఎలా వాడిపోయి ఉంటుందో. అంటే నిద్ర మీ ముఖంపై ఎంతటి ప్రభావాన్ని చూపుతుందో తెలుస్తుంది. నిజానికి నిద్ర కేవలం ముఖంపైనేకాదు మన రోజువారీ పనిమీద కూడా ప్రభావం చూపుతుంది. రాత్రి నిద్ర సరిగా లేకపోతే మరునాడు పనిమీద సరిగా మనసు కేంద్రీకరించడం సాధ్యంకాదు. ఫలితంగా మనం చేసే పనిలో తప్పులు జరుగుతుంటాయి. ఇలా మనం నిద్ర లేకుండా ఉండడం వల్ల ఇటు మన ఆరోగ్యం పైనే కాకుండా మన రోజువారీ పనిపైన కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి చక్కగా నిద్రపోవడం వల్ల ఇలాంటి సమస్యను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు కంటినిండా నిద్ర లేకపోతే కళ్లు ఉబ్బడం, కంటికింద నల్లటి వలయాలు ఏర్పడడం వంటి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి చక్కగా నిద్రపోవడం వల్ల ఈ సమస్యలను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మీకు రేపు ఏదైనా ఇంటర్వ్యూ, లేదా ఫంక్షన్‌కు వెళ్లాల్సి వస్తే ఈరోజు రాత్రి చక్కగా కంటినిండా నిద్రపోండి చాలు...!

  • Loading...

More Telugu News