: సైనిక ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న భారత్


భారత అంతరిక్ష చరిత్రలో తొలిసారిగా ఓ సైనిక ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. జీశాట్-5గా వ్యవహరించే ఈ ఉపగ్రహాన్ని సైనిక అవసరాలకోసం వినియోగిస్తారు. తొలుత ఈ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ రాకెట్ తో కక్ష్యలో ప్రవేశపెట్టాలని నిర్ణయించినా, ఆ రాకెట్ తయారీకి మరికొంత కాలం పట్టనుండడంతో విదేశీ రాకెట్ వైపు దృష్టి సారించారు.

విశ్వసనీయ రాకెట్ గా పేరుపొందిన ఫ్రెంచ్ తయారీ ఏరియాన్ రాకెట్ తో జీశాట్-5ను అంతరిక్షంలో పంపాలని ఇస్రో భావిస్తోంది. ఈ ఏడాది ప్రయోగం నిర్వహించేందుకు ఇస్రో ప్రణాళిక సిద్ధం చేసింది. తాజాగా బడ్జెట్ లో ఈ ప్రయోగానికి రూ. 445 కోట్లు కేటాయించడంతో ఇస్రో వర్గాల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. ఈ ఉపగ్రహం వివిధ భారత యుద్ధ నౌకలు, జలాంతర్గాముల అనుసంధానానికి  అవసరమైన కమ్యూనికేషన్ సేవలందిస్తుంది. 

  • Loading...

More Telugu News