: ఉద్యమం నడుపుతోంది స్వార్థపరులే: ఈటెల


సీమాంధ్రలో ఉద్యమం నడుపుతోంది కొందరు స్వార్థపరులేనని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. హైదరాబాదు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, కొందరు నేతలు స్వప్రయోజనాల కోసం కృత్రిమ ఉద్యమం సృష్టించారని ఆరోపించారు. సీఎం కిరణ్, విపక్ష నేతలు చంద్రబాబు, జగన్ తమ కపటవైఖరి చాటుకున్నారని ఈటెల మండిపడ్డారు. ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్న కిరణ్ ను కాంగ్రెస్ పార్టీ నేతలే విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక ప్రాంతానికే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్న కిరణ్ కు ఈ రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదని స్పష్టం చేశారు. గవర్నర్ ఈ ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. ఇక తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చానని చెబుతున్న చంద్రబాబు పచ్చి సమైక్యవాది అని, ఆంధ్రా పక్షపాతి అని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News