: అక్టోబర్ 15 వరకు సమ్మె కొనసాగుతుంది: అశోక్ బాబు
ఏపీఎన్జీవోలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. వచ్చేనెల 15 వరకు సమ్మె కొనసాగించాలని నిర్ణయించినట్లు ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. అక్టోబర్ 2న జిల్లా, మండల కేంద్రాల్లో గాంధీ విగ్రహాల వద్ద నిరసనలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. 3, 4 తేదీల్లో సీమాంధ్ర ఎంపీల ఇళ్లముందు నిరసనలు తెలుపుతామని, ఐదో తేదీన 12 గంటలపాటు రహదారుల దిగ్బంధం చేపడతామని ప్రకటించారు. 5, 6 తేదీల్లో ప్రైవేటు ట్రావెల్స్, పెట్రోల్ బంకులు మూసివేయాలన్నారు. 7, 8 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల ముట్టడి ఉంటుందని తెలిపారు. 9, 10, 11 తేదీల్లో ఢిల్లీలో జాతీయ పార్టీల నాయకులను కలుస్తామన్నారు. తెలంగాణ నోట్ తయారుకాకుండా ఒత్తిడి తెస్తామన్నారు.