: హైదరాబాద్ లో మరో చిన్నారి మాయం


హైదరాబాద్ నగరంలో చిన్నారుల కిడ్నాపులకు తెరపడడం లేదు. గత ఆరు నెలల కాలంలోనే సుమారు 10మంది వరకూ బాలలు అపహరణకు గురయ్యారు. దీని వెనుక ఒక ముఠా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదులు వస్తున్నా పోలీసులు చిన్నారులను ఎత్తుకుపోతున్న ముఠాను పట్టుకోలేకపోతున్నారు.

తాజాగా ఈ రోజు ఉదయం మల్కాజ్ గిరి ఆనంద్ బాగ్ ప్రాంతంలో మరో బాలుడు మాయమయ్యాడు. ఏడాదిన్నర వయసున్న గౌతమ్ ఇంటి ముందు ఆడుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సరిగ్గా అన్ని కిడ్నాపులూ ఇలానే జరుగుతున్నాయి. ఇంటి ముందు ఒంటరిగా ఆడుకుంటున్న చిన్నారులను ఎత్తుకుపోతున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ పరిధిలో ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. దీనిని బట్టి ఇది కచ్చితంగా ఓ ముఠా పనేననే అనుమానాలు బలపడుతున్నాయి. 

  • Loading...

More Telugu News