: వ్యభిచారం చట్టబద్ధం చేయాలి: ఐపీఎస్ దంపతులు
వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయాలంటున్నారీ ఐపీఎస్ దంపతులు. గోవా రాష్ట్రంలో ఐపీఎస్ అధికారులుగా పని చేస్తున్న ప్రియాంక, కార్తీక్ కశ్యప్ లు భార్యాభర్తలు. ఇటీవల పనాజీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ జంట.. వ్యభిచారాన్ని చట్టబద్ధం చేయాలని అన్నారు. ఇప్పుడీ వ్యాఖ్యలు దేశంలో సంచలనం సృష్టిస్తున్నాయి. దీనిపై తీవ్ర దుమారం రేగడంతో ఇది తమ వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. గతంలో గోవాలో బార్ డాన్సర్లకు మద్దుతుగా మాట్లాడిన ఓ బీజేపీ నేత నాలుక కరచుకుని అది తన వ్యక్తిగత అభిప్రాయం అని వివరణ ఇచ్చుకున్న సంగతి తెలిసిందే.