: ఐపీఎల్ వ్యవహారాల్లో శ్రీనివాసన్ జోక్యం చేసుకోకూడదు:సుప్రీంకోర్టు
ఎన్.శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతారని, అయితే, ఆయన ఐపీఎల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది. శ్రీనివాసన్ కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ పై విచారణను సుప్రీం కోర్టు అక్టోబర్ 7 కు వాయిదా వేసింది. శ్రీనివాసన్ అల్లుడు మెయ్యప్పన్ ఐపీఎల్ లో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో అరెస్టైన సంగతి తెలిసిందే. దీని కారణంగానే శ్రీనివాసన్ పై ఆరోపణలు వెల్లువెత్తడం, తద్వారా ఆయన బోర్డు అధ్యక్ష బాధ్యతలకు దూరమయ్యారు. తాజాగా, బోర్డు ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికవడంతో మరో ఏడాది పాటు శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు.