: చైనా బొగ్గుగనిలో 11 మంది అగ్నికి ఆహుతి
ఉత్తర చైనాలోని జాంగ్జయాకౌ పట్టణంలోని బొగ్గు గనిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గత అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు చనిపోయారు. మరో ఇద్దరు కార్మికులు గల్లంతయ్యారు. అధికారులు వారి కోసం సహాయక చర్యలు చేపట్టారు. బొగ్గు గనిలోని ఎయిర్ కంప్రెషర్ కు మంటలు అంటుకొని అంతటా వ్యాపించడంవల్లే ప్రమాదం చోటు చేసుకున్నట్లు గని అధికారులు చెప్పారు. ప్రమాద సమయంలో గనిలో 13 మంది కార్మికులు ఉన్నారని తెలిపారు.