: తెలంగాణను దేవుడు కూడా ఆపలేడు : కేకే
కేవలం కేసీఆర్ వల్లే తెలంగాణ రాబోతోందని తెరాస నేత కే.కేశవరావు తెలిపారు. ఇక తెలంగాణను దేవుడు కూడా ఆపలేడని అన్నారు. సకలజన భేరిలో ప్రసంగిస్తూ ఆయన ఈ విధంగా స్పందించారు. తెలంగాణపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చర్చిస్తున్నప్పుడు తాను అక్కడే ఉన్నానని, కేసీఆర్ కోసమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు రాహుల్ గాంధీ తనతో అన్నారని కేకే చెప్పారు. సకల జన భేరి... విజయ భేరి కాబోతోందని అన్నారు. హైదారాబాద్ పై ఎలాంటి కిరికిరి ఉండబోదని హామీ ఇచ్చారు. తెరాస అధినేత కేసీఆర్ పై జరిగినన్ని దాడులు ఎవరి మీదా జరిగుండవని... ఈవాళ ఆ కేసీఆరే లేకపోతే ఒక ఆంధ్రా వ్యక్తి కూడా హైదరాబాద్ లో ఉండలేకపోయేవాడని కేకే తెలిపారు. అంతేకాకుండా, డీజీపీ దినేష్ రెడ్డిలో ఎంత విషముందో తెలంగాణ వాదులంతా గమనించారని విమర్శించారు.