: కాంగ్రెస్ ఇవ్వకపోతే తెలంగాణను బీజేపీ ఇస్తుంది : నాగం


తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ కట్టుబడి ఉందని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి తెలిపారు. సకల జన భేరిలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. నిన్న జరిగిన పాలమూరు సభలో ఈ విషయాన్ని సుష్మాస్వరాజ్ స్పష్టంచేశారని తెలిపారు. ఈ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టకపోతే కాంగ్రెస్ భూస్థాపితమవుతుందని తెలిపారు. ఒకవేళ కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకపోతే బీజేపీ ఇస్తుందని ప్రకటించారు. రానున్న ఎన్నికలలో మోడీ ప్రధాని అవుతారని... వెంటనే తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తారని అన్నారు. అంతేకాకుండా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని... కిరికిరి రెడ్డిగా అభివర్ణించారు. తెలంగాణ విద్యార్థులపై రబ్బరు బుల్లెట్లను ప్రయోగించిన డీజీపీ దినేష్ రెడ్డి పీడ వదిలిపోయిందని తెలిపారు. ఇకపై సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిని డీజీపీగా నియమించరాదని అన్నారు.

  • Loading...

More Telugu News