: బీసీసీఐ అధ్యక్షుడిగా శ్రీనివాసన్ ఎన్నిక
బీసీసీఐ అధ్యక్షుడిగా శ్రీనివాసన్ మూడోసారి ఎన్నికయ్యారు. కొంత సేపటి క్రితమే చెన్నైలో సమావేశమైన బీసీసీఐ సభ్యులు శ్రీనివాసన్ ను అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే, శ్రీనివాసన్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ పగ్గాలు చేపట్టడానికి వీల్లేదు. ఎందుకంటే, అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైనా... ఐపీఎల్ కుంభకోణాల్లో తన నిజాయతీని నిరూపించుకున్న తర్వాతే శ్రీనివాసన్ బాధ్యతలను స్వీకరించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.