: 4 లక్షల మందితో సీమాంధ్ర సభ
ఈ రోజు కర్నూలులో తలపెట్టిన 'సమైక్య రాష్ట్ర జన గర్జన సభ'కు దాదాపు 4 లక్షల మంది సమైక్యవాదులు హాజరవుతున్నారని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే భారీ సంఖ్యలో ప్రజలు, ఉద్యోగులు సభకు చేరుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాల్లో పనిచేస్తున్న 20 వేల మంది అధ్యాపకులు గర్జన సభకు హాజరవుతున్నారు. దీనికి తోడు ఈ సభలో ఏపీఎన్జీవో నేత అశోక్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. అంతే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాల సభ్యులు, వివిధ గ్రామాలకు చెందిన గ్రామస్తులు ఈ సభకు భారీగా తరలి వస్తున్నారని నిర్వాహకులు వెల్లడించారు. ఈ సభ ద్వారా యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీకి బుద్ధి రావాలని కోరుకుంటున్నామని అన్నారు.