: మన్మోహన్, నవాజ్ షరీఫ్ ల భేటీని ఆకాశానికెత్తేస్తున్న పాక్ మీడియా
అమెరికాలో భారత్, పాక్ ప్రధానమంత్రుల మధ్య జరగనున్న భేటీకి భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడాన్ని పాక్ మీడియా ఆకాశానికెత్తేస్తోంది. అమెరికాలో ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాలకు హాజరైన ఇరు దేశాల ప్రధానమంత్రులు రేపు (ఆదివారం) న్యూయార్క్ లో భేటీ కానున్నారు. జమ్మూకాశ్మీర్ లో రెండ్రోజుల క్రితం ఉగ్రవాద దాడి జరగడంతో... వీరి మధ్య భేటీ ఉండకపోవచ్చని చాలామంది భావించారు. కానీ షెడ్యూలు ప్రకారం భేటీకి భారత ప్రభుత్వం మొగ్గుచూపడంతో సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది. పాక్ మీడియా ఈ విషయానికి విశేష ప్రాధాన్యతను ఇస్తోంది. పాక్ లోని వివిధ మీడియా సంస్థలు ఏవిధంగా స్పందించాయో చూద్దాం.
ది డాన్ :- జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి జరపడం ద్వారా ఇరు దేశాల ప్రధానుల సమావేశానికి ఆటంకాలు కలిగించాలనుకున్న తీవ్రవాదుల ఆటలు కొనసాగలేదు. వారి మధ్య చర్చలు కొనసాగబోతున్నాయి. ఈ చర్చల విషయంలో భారత ప్రధాని చూపిన చొరవ అమోఘం. జరిగిన దాడులకు పాకిస్థాన్ ను నేరుగా విమర్శించకుండా... ఆశావహ దృక్పథంతో చర్చలకు సిద్ధమవడం చాలా గొప్ప విషయం. పాకిస్థాన్ అత్యంత అనుకూలమైన దేశాల జాబితాలో భారత్ కు చోటివ్వాలి... లేనిపోని అనుమానాలకు తావివ్వరాదు...
ది న్యూస్ ఇంటర్నేషనల్:- పాకిస్థాన్ తో చర్చలు జరపాలన్న భారత్ ఆకాంక్షను స్వాగతిస్తున్నాం.
ది డైలీ టైమ్స్:- దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ (బీజేపీ) ఒత్తిడిని భరిస్తూ కూడా కీలకమైన చర్చలకు ముందుకు రావడం భారత ప్రభుత్వ గొప్పదనం.