: హైదరాబాదులో యానిమేషన్ మీడియా సిటీ ఏర్పాటు
హైదరాబాదు నగరంలో యానిమేషన్ మీడియా సిటీ రూపకల్పనకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. హైదరాబాదు శివారు రాయదుర్గం ప్రాంతంలో ఇందుకోసం 30 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశామని మంత్రి చెప్పారు. వచ్చే నెలలో దీనికి శంకుస్థాపన చేస్తామన్నారు.
మన రాష్ట్రంలో అరవై కంపెనీలు ఈ యానిమేషన్ రంగంలో సేవలు అందిస్తున్నాయనీ, వీటి అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుందనీ మంత్రి తెలిపారు. ఆస్కార్ అవార్డు పొందిన 'లైఫ్ ఆఫ్ పై' చిత్రానికి విజువల్ ఎఫెక్ట్స్ సమకూర్చిన రిథమ్ అండ్ హ్యూస్ సంస్థను మంత్రి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు.