: ఆఫ్గాన్ లో పోలీసు అధికారి ఉన్మాదం... 17 మంది సహచరుల మృతి
ఆఫ్గనిస్తాన్ లో ఓ పోలీసు అధికారి పదిహేడు మంది సహచరుల మరణానికి కారకుడయ్యాడు. ఉన్మాదం తలకెక్కిన ఆ అధికారి సహచరులకు మత్తు పదార్ధాలు ఇచ్చాడు. వారు అపస్మారక స్థితిలోకి వెళ్లగానే తాలిబాన్లను పిలిచి వారి సహకారంతో సహచర పోలీసులను హతమార్చాడు. ఇటీవలే విధుల్లో చేరిన ఏడుగురు యువకులు చనిపోయిన వారిలో ఉన్నారు. గతకొద్ది కాలంగా ఆఫ్గన్ లో ఇలాంటి కోవర్టు ఆపరేషన్లు ఎక్కువయ్యాయి.