: రాహుల్ వ్యాఖ్యలు సబబే: బొత్స
నేర చరిత కలిగిన ప్రజాప్రతినిధులకు దన్నుగా యూపీఏ తీసుకురానున్న ఆర్డినెన్స్ పై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ సమర్ధించారు. ఆర్డినెన్స్ విషయంలో రాహుల్ వ్యాఖ్యలు సబబేనన్నారు. తప్పులు ఎత్తిచూపేందుకు ప్రతిపక్షాలకు అవకాశమివ్వరాదని అన్నారు. కాబట్టి, రాహుల్ స్పూర్తితో కాంగ్రెస్ నేతలు పనిచేయాలని సూచించారు. ఆ ఆర్డినెన్స్ ను చింపి చెత్తబుట్టలో పడేయాలని రాహుల్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.