: హైదరాబాదులో మైనర్ బాలికపై అత్యాచారం


హైదరాబాదులోని ఖైరతాబాద్ ప్రాంతంలో.. తొమ్మిదో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై స్థానికంగా ఉండే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఖైరతాబాదులోని జాగీర్ దార్ బడా బస్తీలో అద్దెకు ఉంటున్న జగదీశ్ అనే యువకుడు సమీపంలోని ఓ పాఠశాలలో చదవుతున్న 14 ఏళ్ల బాలికతో పరిచయం పెంచుకున్నాడు. బాలికను లొంగదీసుకుని కొంత కాలంగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. బాలిక వాంతులు చేసుకోవడంతో ఆసుపత్రిలో చేర్చిన తల్లిదండ్రులకు వైద్యులు బాలిక గర్భవతి అని చెప్పారు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, జగదీశ్ తో పాటు ఉండే మరో యువకుడి కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News